పాల ట్యాంకర్ కు అంటుకున్న మంటలు
30-09-2026 | 03:33pm
- అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెంలో సంఘటన
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 30: పాల ట్యాంకర్ కు మంటలు అంటుకున్న సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ (Abdullapur Met Police Station)పరిధిలో బుధవారం చోటు చేసుకు సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ పాల ట్యాంకర్ ఎల్బీనగర్ నుంచి విజయవాడ వైపు బయలుదేరగా... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కొత్తగూడెం వద్ద జాతీయ రహదారిపై పాల ట్యాంకర్లో మంటలు చెలరేగాయి.
ఎల్బీనగర్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్‌పై విద్యుత్ వైర్లు తెగిపడి పడటంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.