నాగలిగిద్దలో డీసీఎస్ పంట సర్వే పర్యవేక్షణ
18-09-2026 | 03:52pm
నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగలిగిద్ద మండలం(Nagaligidda Mandal)లోని మోర్గీ, శాపూర్ గ్రామాల్లో డీసీఎస్ పంట సర్వే(DCS crop survey)ను మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ చారి, ఏఈఓలతో కలిసి పర్యవేక్షించారు. రైతులు(Farmers) సర్వేయర్లకు సహకరించి, సాగు చేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. పంటల నమోదు ద్వారా ప్రభుత్వ పథకాలు, ఎరువులు, వ్యవసాయ శాఖ(Department of Agriculture) సేవలు సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. సర్వేను వేగంగా, పారదర్శకంగా, పొరపాట్లు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఓ మహిపాల్, సర్వేయర్లు పాల్గొన్నారు.