టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు కాటా విజయదశమి శుభాకాంక్షలు
26-10-2026 | 05:30pm
పటాన్‌చెరు/అమీన్ పూర్, అక్టోబర్ 26: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar)ను పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన కాటా శ్రీనివాస్ గౌడ్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగలు పరస్పర స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.