కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

17-09-2026 | 10:52pm

* తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు

సిర్గాపూర్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని గైరాన్ తండా గ్రామ పంచాయతీలో బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షలు నర్సాగౌడ్ కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

లొంక తాండలో బీఆర్‌ఎస్ గిరిజన నాయకుడు నారాయణ, యువజన నాయకుడు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషికి కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, కృషి మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు