రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం
గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, అక్టోబర్ 27: గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం(Telangana State Ration Dealers' Welfare Association) ఆధ్వర్యంలో నిర్వహించిన గౌరవ వేతన సాధన సభ, నూతన రాష్ట్ర కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి హరీష్ రావుతో(Former Minister Harish Rao) కలిసి పటాన్చెరు ఎమ్మెల్యే, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, లక్ష మందితో హైదరాబాద్లో భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.