ప్రజావాణిలో బీఆర్‌ఎస్ ఫిర్యాదుల వెల్లువ

08-09-2026 | 12:47am

- సమస్యలపై అధికారులకు వినతిపత్రాల సమర్పణ

కొండపాక,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం కొండపాక మండల(Kondapaka Mandal) ప్రజావాణికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సుమారు 200 మందికి పైగా పాల్గొని తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లకు పెద్ద ఎత్తున వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి అనంతుల అశ్విని ప్రశాంత్, రాగల దుర్గయ్య, నూనె కుమార్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు