వినాయకునికి కుంకుమార్చనలు

19-09-2026 | 09:42pm

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ(Gajwel-Pragnapur Municipality) పరిధిలోని జర్నలిస్టు వెల్ఫేర్ కాలనీలో వినాయక మండపంలో గణనాథునికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజలతో పాటు, వినాయకునికి లలితా పరమేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరి యోగక్షేమాలను కాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు