పెరుమాళ్ల వెంకటయ్య మృతికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు

30-09-2026 | 03:45pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 30 : మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సీనియర్ నాయకులు,రిటైర్డ్ ఎంపీడీఓ పెరుమాళ్ల వెంకటయ్య(Perumalla Venkataiah) అనారోగ్యంతో మృతిచెందటం పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.వెంకటయ్య ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నో ఏళ్లు సేవలందించి,పదవీ విరమణ అనంతరం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

ఆయన భార్య పెరుమాళ్ల పద్మ గతంలో అడివెంల గ్రామ మాజీ సర్పంచిగా పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారు.బుధవారం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు,మాజీ ఎంపీపీ,జెడ్పీటీసీ దావుల మనీషావీరప్రసాద్ యాదవ్,మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ లు గ్రామంలో వెంకటయ్య పార్థివ దేహాన్ని సందర్శించి,పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు కలకోట్ల శైలేందర్,కర్నాటి వెంకన్న,బీఆర్ఎస్ నాయకులు చిర్రబోయిన వెంకన్న,ఉపసర్పంచులు వజ్జె చిన్నరవి,లింగంపల్లి రవీందర్,నాయకులు బంటు యాదగిరి,మంగ లక్ష్మయ్య,మేడెబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు