ఆర్ఎంపీ డా.నగేష్ మృతి బాధాకరం
09-09-2026 | 10:33pm
- కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని లాల్ తండ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దారావత్ నగేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్(Former MLA Bollam Mallaiah Yadav) బుధవారం లాల్ తండలోని నగేష్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. నగేష్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.