జపాన్ పర్యటనతో తెలంగాణ విద్యకు కొత్త దిశ
గరిడేపల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంతర్జాతీయ ఎక్స్పోజర్ పర్యటనకు ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ ఎంపికయ్యారు. జపాన్లోని విద్యా విధానం, ఆధునిక సాంకేతికత, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను అధ్యయనం చేసి, వాటి ద్వారా పొందిన అనుభవాన్ని తెలంగాణ విద్యా ప్రగతికి ఉపయోగించనున్నారు.
16-08-2026