కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

09-09-2026 | 06:13pm

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఎంపీ మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారంపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మల్లు రవి విజ్ఞప్తి 

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు(Congress cadres) ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారం వెనుక కేసీఆర్‌ ఉన్నారని ఆరోపిస్తూ ఆయన ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న కేటీఆర్‌, హరీశ్‌రావులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు