ఎమ్మెల్యే సామెల్ కృషితో.. కళాశాల పనులకు శంకుస్థాపన!

06-11-2026 | 10:26pm

33 ఏళ్ల కల సహకారమైన వేళ..

ఎమ్మెల్యేకు సంబండావర్గాల ప్రజలు... జేజేలు

తుంగతుర్తి, (విజయక్రాంతి): తిరుమలగిరి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Sameelu) అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ(Thirumalagiri Municipality) కేంద్రంలో శుక్రవారం విద్యాశాఖ నిధులతో (5.30 కోట్ల) నిర్మించు నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల , భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమనికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రితో కొట్లాడి, కళాశాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.

గడిచిన 33 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జూనియర్ కళాశాల(Junior College) కావాలని, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు సైతం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. జూనియర్ కళాశాల భూమి పూజ కార్యక్రమం పట్ల ఎమ్మెల్యేకు సంబండా జాతి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రత్యేక నిధుల కోసం నిరంతరం శ్రమిస్తానని అన్నారు.

ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను(welfare schemes), ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం 5 లక్షల మంజూరు చేస్తుందని అవకాశాన్ని పేద ప్రజలు రాజకీయాలకతీతంగా, అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు