మున్సిపాలిటీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

03-10-2026 | 08:02pm

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు కొణతం వెంకటరెడ్డి, నూకల. సందీప్ రెడ్డి.

నేరేడుచర్ల, అక్టోబర్ 3(విజయక్రాంతి) : నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) శనివారం నాడు  మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్లో, మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డులను(Smart ration cards) మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ లు కొణతం వెంకటరెడ్డి, నూకల. సందీప్ రెడ్డి లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రేషన్ లబ్ధిదారులకు(Ration beneficiaries) ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం పథకాన్ని పంపిణితో పేద ప్రజల ఆకలి తీరుతుందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు,ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగం, సన్న రేషన్ బియ్యం, ఆసరా పింఛన్లు, రైతులకు రైతు భరోసా పథకం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉచిత పథకాలు అందజేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని,రాష్ట్ర మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సొంత నిధులతో నేరేడుచర్ల మున్సిపాలిటీ అత్యంతగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు సిహెచ్ , 1,2,8,9, 10,11,12,వ వార్డు కౌన్సిలర్ల  గగులోతు రవి నాయక్  యారవ లక్ష్మీ శ్రీనివాస్, ఇంజమూరి శ్రీకాంత్, తాళ్ల లావణ్య, ఇంజమూరి వెంకటమ్మ , షేక్ షహనాజ్ ,మహమ్మద్  అబ్దుల్ కలీం, కోఆప్షన్ సభ్యులు అలక శ్రవణ్ రెడ్డి, షేక్ మొగలాబి పిఎసిఎస్  డైరెక్టర్లు దేవులపల్లి శంకరాచారి తాళ్ల సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గజ్జల కోటేశ్వరరావు, డి.పురోషోత్తం రెడ్డి యారవ సురేష్, కట్ట భూపాల్ రెడ్డి గంజిరాల శ్రీనివాస్ బెల్లంకొండ శేఖర్ రేషన్ డీలర్లు చింతమల్ల సైదులు కొమర్రాజు రమాదేవి, రవి, ఎల్లయ్య, శిరీష, రేషన్ లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు