Breaking News

పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారిద్దాం

26-09-2026 | 04:29pm

గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి: సర్పంచ్ 

మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బక్కమంతుల గూడెం సెక్టార్ పరిధిలోని కొత్త దొనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు పాల్గొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, గర్భిణులు, బాలింతలు కూడా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిశుభ్రతతో పాటు సమతుల్య ఆహారపు అలవాట్లను పెంపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సోమమ్మ,టీచర్ సంతోషి కుమారి, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు