“సఫాయి మిత్ర సురక్షా ఏవం సమ్మాన్"ఆరోగ్య శిభిరం
నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా “సఫాయి మిత్ర సురక్షా ఏవం సమ్మాన్" (Safai Mitra Suraksha Evam Samman)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న సఫాయి మిత్రలు (శానిటేషన్ కార్మికులు) కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించారు.ఈ సందర్బంగా మున్సిపల్ పాలక వర్గం మాట్లాడుతూ...
పట్టణ పరిశుభ్రతను కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని, వారి ఆరోగ్యం మరియు భద్రతకు మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి , వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి , కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొని సఫాయి మిత్రల సేవలను అభినందించారు.