ఈ సాయంత్రం శుభవార్త!

04-10-2026 | 10:35am

వృశ్చిక రాశి (Scorpio) వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుజుడు తొమ్మిదో స్థానంలో సంచరిస్తుండటంతో కొన్ని విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ (Health Care) అవసరం. ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం ఈరోజు అనారోగ్యానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల కారణంగా అదనపు ఖర్చులు (Medical Expenses) పెరగవచ్చు. అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శారీరకంగా అలసటగా అనిపిస్తే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 

కుటుంబంలో కొంత అసౌకర్యం

కుటుంబ జీవితంలో కొంత అసౌకర్యకర వాతావరణం (Family Tensions) కనిపించొచ్చు. చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున.. మాట పట్టింపులకు దూరంగా ఉండటం మంచిది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పెద్దవి కాకుండా చూసుకోవచ్చు.

సాయంత్రం శుభవార్త!

అయితే సాయంత్రం వేళ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శుభవార్త (Good News) వినే అవకాశం కనిపిస్తోంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విషయం విషయంలో సానుకూల సమాచారం అందవచ్చు. దీంతో మనసుకు కొంత ఊరట లభిస్తుంది.

రాత్రి శుభకార్యానికి హాజరు

రాత్రి సమయంలో ఓ శుభకార్యానికి (Auspicious Event) హాజరయ్యే అవకాశం లభించొచ్చు. బంధువులు, సన్నిహితులతో కలిసి సమయం గడపడం వల్ల మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశివారి పరిహారం

ఈరోజు సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని (Copper Vessel) సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించడం ద్వారా సానుకూలత (Positive Energy) పెరుగుతుందని జ్యోతిష్య విశ్వాసం.


మరిన్ని వార్తలు