ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ...
- శని ఆదివారాలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది
- శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంను క్షేత్రస్థాయి పరిశీలించిన దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్
యాదగిరిగుట్ట, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట(Yadagirigutta, a pilgrimage site) శ్రీ లక్ష్మీనరసింహస్వా మి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు.
సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో
కార్తీక మాసం శని,ఆదివారాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పంటపాన్ని శుక్రవారం దేవస్థానం ఈవో భవాని శంకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో భవాని శంకర్ మాట్లాడుతూ గత సంవత్సరము, ఈ సంవత్సరం 15 రోజులుగా నమోదైన భక్తుల రద్దీని ప్రాతిపదికగా తీసుకొని,
అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను నిర్వహించుకునేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
భక్తులందరూ దేవస్థాన అధికారులు, సిబ్బంది సూచనలను పాటిస్తూ, క్రమపద్ధతిలో వ్రతాలు నిర్వహించుకొని, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారిని దర్శించండి కోవాలని అన్నారు.