యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

29-11-2026 | 07:27pm
  1. జనసంద్రంగా యాదగిరి కొండ
  2. సత్యనారాయణ స్వామి వ్రతం వద్ద జనమే జనం
  3. ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు
  4. వాహనాలతో కిక్కిరిసిన రింగ్ రోడ్
  5. భక్తులు రద్దీ దృశ్య దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు
  6. 2196 సత్యనారాయణ స్వామి వ్రతాలు
  7. స్వామివారిని దర్శించుకున్న లక్షకు పైచిలుకు భక్తులు

యాదగిరిగుట్ట, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు(Yadagirigutta) కార్తీక మాసం మూడో ఆదివారం సెలవు  కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భారీగా భక్తులు(Devotee) తరలి రావడంతో యాదగిరిగుట్ట జనసంద్రంగా మారింది. సుమారు లక్షకు పైచిలుకు భక్తులు(Devotee) శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారి తెలిపారు. తెల్లవారుజామున నుంచే ఆలయ పరిసరాలు, కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమంటపం కళ్యాణ్ కట్ట భక్తులతో కిటకిటలాడాయి.

ఉదయం 5 గంటల నుంచే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాల నిర్వహణకు భక్తుల(Devotee) రద్దీ ప్రారంభమై నిరంతరంగా కొనసాగింది. 2198 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు వ్రతానంతరం స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు.

మాడ వీధులు, ధర్మదర్శన గోల్డెన్ లైన్, క్యూ కాంప్లెక్స్‌తో పాటు  మూడు హాళ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రత్యేక దర్శనం క్యూలైన్స్ కూడా పూర్తిగా నిండి మాడవీధుల వద్దకు చేరుకున్నది.మాడ వీధులన్నీ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది.

భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న అనంతరం మాడ వీధుల్లో కార్తీక దీపాలను  పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలను  భక్తులు వెలిగించారు. కొండ కింద రింగ్ రోడ్డు వాహనాలతో క్రిక్కిరిసిపోయింది పోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ దర్శనాలు, వ్రతాల నిర్వహణ సజావుగా జరిగేలా  చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు