కన్నుల పండుగగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం

28-11-2026 | 09:54pm

1511 సత్యనారాయణ స్వామి వ్రతాలు

నేడు రద్దీకి అనుగుణంగా దేవస్థానం ఏర్పాట్లు

యాదగిరిగుట్ట,నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో(Sri Lakshmi Narasimha Swamy Temple at Yadagirigutta) కన్నుల పండుగగా స్వామివారి నిత్య కళ్యాణం ను పండితులు నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకులు తులసి దళాలు,సుగంధ ద్రవ్యాలు,పుష్పాలు, మంగళ  హారతులతో అభిషేకము, అర్చన పూజలను నిర్వహించారు. స్వామి వారి ప్రాకారమండపంలో సుదర్శన నరసింహ హోమం,స్వామివారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.

కళ్యాణం లో పాల్గొన్న భక్తులు(devotees) స్వామివారిని దర్శించుకుని తమ మోక్కులను చెల్లించుకున్నారు. సాయంత్రం వెండి జోడు సేవను ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అనుబంధ ఆలయం అయినా శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరాలయంలో కార్తీకమాసం సందర్భంగా స్వయంభు లింగము స్పటిక లింగముకు స్వామివారిని అభిషేకించారు. భక్తులు(devotees) దీపారాధనను చేశారు.

యాదగిరిగుట్ట దేవస్థానం కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వంటపం లో శనివారం 1511 సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాని, ఆదివారం భక్తుల రద్దీకి అనుగుణంగా  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య ఆదాయం 35,27,452/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు