శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన పూజ
22-09-2026 | 12:58pm
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి దేవస్థానం(Sri Bugulu Venkateswara Swamy Temple), ఆలయంలో మంగళవారం సందర్భంగా ఈఓ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో స్వామివారికి బంగారు పద్మాలతో అంగరంగ వైభవంగా అష్టదళ పాద పద్మారాధన పూజ(Ashtadala Pada Padmaradhana Pooja)ను అర్చకులు నిర్వహించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు పొట్లపల్లి శ్రీధర్ రావు, కిరణ్మయి దంపతులు 516 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో,సహాయకులు సి.హెచ్. రాజేందర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు బి. రవీందర్ శర్మ, సౌమిత్రి రంగాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.