మృతి చెందిన హమాలి కుటుంబాన్ని పరామర్శించిన

04-10-2026 | 04:08pm

 ఏఐటీయూసీ నాయకులు

బోథ్. అక్టోబర్ 4 ( విజయ క్రాంతి): మండల కేంద్రానికి చెందిన జమ్మూ రాజ్ మహేష్ సివిల్ సప్లై(Jammu Raj Mahesh Civil Supplies) హమాలీ కార్మికుడు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదివారం ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విలాస్ సిర్రా దేవేందర్(AITUC State Vice-Presidents S. Vilas and Sirra Devender) లు పరామర్శించారు. స్థానిక సివిల్ సప్లై గోడౌన్ లో అమాలిగా పనిచేస్తున్న ఈయన మృతి చెందడం కార్మిక లోకానికి తీరనిలోడని వారు పేర్కొన్నారు.

అంతేగాక సివిల్ సప్లై శాఖ తరఫున మృతుని కుటుంబానికి రావలసిన అన్ని రకాల బెనిఫిట్ లు అందే విధంగా చూస్తామన్నారు. కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి గోవర్ధన్ దేవేందర్ లో మాట్లాడుతూ కార్మికుని కుటుంబానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఐటియుసి సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎస్కే హాల్మత్, పల్లికొండ ఉషన్న, గడ్డం లింగన్న, మోతె రవి, జుమ్మెరత్, శైలేందర్ ఎస్ కె ముఖి, లో ఉన్నారు.

మరిన్ని వార్తలు