రెడ్ క్రాస్ జిల్లా కమిటీ మెంబెర్ అబ్బు సతీష్

04-10-2026 | 04:05pm

కన్నాయిగూడెం, అక్టోబర్ 04 (విజయక్రాంతి): ములుగు జిల్లా రెడ్ క్రాస్ అసోసియేషన్(Mulugu Red Cross Committee) జిల్లా కమిటీ మెంబెర్ గా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామానికి చెందిన అబ్బు సతీష్ (ముప్పనపల్లి సహాయనిధి వాట్సాప్ గ్రూప్ అధ్యక్షులు)ను ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం అబ్బు సతీష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా కమిటీలో బాధ్యతలు అప్పగించి,ఎన్నికకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు