ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పదవికి దరఖాస్తుల స్వీకరణ

04-10-2026 | 04:07pm

డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 04 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పదవికి అర్హత కలిగిన ఓబీసీ నాయకుల నుంచి దరఖాస్తులను ఈనెల 12వ తేదీన స్వీకరించడం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్(Congress Party President Battu Karnakar) తెలిపారు.

ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్ణాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేస్తూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయగల సామర్థ్యం ఉన్న ఓబీసీ నాయకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో ఓబీసీ వర్గాల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఓబీసీ సెల్ జిల్లా ఇంచార్జి పరిశీలకులు కుమారస్వామి మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పాటు సంస్థాగత నిర్మాణంలో చురుకుగా పనిచేసే నాయకులు తమ దరఖాస్తులను ఈనెల 12న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ( ఐఎన్టీయూసీ ) సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు