ప్రతి ఒక్కరికి చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలి

30-09-2026 | 03:16pm

తాసిల్దార్

బోథ్. సెప్టెంబర్ 30 ( విజయక్రాంతి) ప్రతి ఒక్కరికి చట్టాల పైన అవగాహన ఉండాలని సోనాల మండల తహసిల్దార్ మల్లేష్(Tahsildar Mallesh) పేర్కొన్నారు మండలంలోని పార్టీ (కె) గ్రామ పంచాయతీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.

మావేశంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చౌహన్ వినోద్ సింగ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో చట్టాల పైన అవగాహన లేక ఎంతో మంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అన్నారు. అప్పుడు మార్గంలో తెలిసి తెలియక వెళ్లడం వల్ల కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది గురవుతున్నారు అన్నారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు కామ్రే భీమ్రావు, ఉప సర్పంచ్ అశోక్ సీనియర్ అసిస్టెంట్ మురళి గ్రామ కార్యదర్శి ఆమనిక, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ జూనియర్ అసిస్టెంట్ జీవన్ జీపిఓ అనుజ్ఞ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు