ఫ్యాన్‌ను వెతుక్కుంటూ వెళ్లిన తారక్.. వీడియో వైరల్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ఆప్యాయత మరోసారి కనిపించింది. ఇటీవల దేవర రీ రిలీజ్ సందర్భంగా తారక్‌ను కలిసిన ఓ ప్రత్యేక అభిమానిని.. తాజాగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ వ్యక్తిగతంగా కలిశారు. అభిమానిని చూసిన తారక్ అతడితో ఆప్యాయంగా ముచ్చటించి, ఆ క్షణాలను మధుర జ్ఞాపకంగా మార్చారు. దేవర రీ రిలీజ్ సమయంలో జరిగిన పరిచయం.. ఇప్పుడు మరోసారి తారక్‌తో భేటీ కావడంతో ఆ అభిమానికి ఇది మరపురాని అనుభూతిగా మారింది.
ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానిని ప్రత్యేకంగా కలిసిన ఎన్టీఆర్.. అతడికి స్వీట్ మెమొరీస్ అందించారు. దీంతో అక్కడున్న అభిమానుల్లోనూ ఈ భేటీ ఆసక్తిని రేకెత్తించింది. అభిమానులకు తారక్ ఇచ్చే ప్రాధాన్యతకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా స్టార్ హీరోలను కలవడం అభిమానులకు అరుదైన అవకాశం కాగా.. గతంలో కలిసిన అభిమానిని మరోసారి గుర్తించి వ్యక్తిగతంగా కలవడం ఈ మూమెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Man of masses NTR ❤️
— Telugu Cineverse (@TeluguCineverse) September 30, 2026
Tarak met the same ardent fan who was seen at the #Devara re release ❤️
The fan is deaf and mute, and @tarak9999 personally met him yesterday at the #DontTroubleTheTrouble Pre Release Event, making the moment truly special for him 🥹❤️#NTR pic.twitter.com/l2fR6Vywo4