పూసపల్లి ఓసీపీపై ఏఐటీయూసీ ఫోకస్

30-09-2026 | 05:23pm

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లెందు ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న పూసపల్లి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు (Open Cast Project - OCP) పనులను ఏఐటీయూసీ (AITUC) గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. జేకేఓసీపీ (JK OCP) రక్షణ అధికారి ఏజీ శివప్రసాద్‌ వెంట ఉండి ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు.అభివృద్ధి పనులు, సబ్‌స్టేషన్‌ ప్రాంతం (Substation Area), క్రషర్ల నిర్మాణం (Crusher Construction), ఓసీ ఓబీ (Overburden - OB) పనులు ప్రారంభించే ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూసపల్లి ఓసీపీ కోసం నిర్వాసితులైన గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ (R&R Package), ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రాజెక్టులో స్థానిక నిరుద్యోగ యువతకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో (Outsourcing Jobs) ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.పూసపల్లి ఓసీపీ ఇల్లెందు ఏరియా ప్రజలకు ఆశాకిరణమని, ప్రాజెక్టును సకాలంలో ప్రారంభిస్తే ఏరియా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్మికుల సంక్షేమమే గుర్తింపు సంఘం (Recognised Union) ధ్యేయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏరియా అధికారులు, బ్రాంచ్‌ కార్యదర్శి ఎండీ నజీర్‌ అహ్మద్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొరిమి సుందర్‌, సీపీఐ (CPI) మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, టీజేఎస్‌ (TJS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్‌ కృష్ణ, ఫిట్‌ కార్యదర్శులు వి. జయరాజ్‌, దాట్ల వెంకటేశ్వర్లు, తిలక్‌నగర్‌ ఉపసర్పంచ్‌ షేక్‌ ఖాసీం, బాషపాక రవి, ఇబ్రహీం, సైదారెడ్డి తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు