అనాధ ఆశ్రమంలో అన్నదానం

30-09-2026 | 05:46pm

సామాజిక సేవలో ఆర్టీఐ కార్యకర్త మిడిసినమెట్ల సతీష్

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): మహానీయుల స్ఫూర్తితో  యువత సమాజ సేవలో ముందుకు రావాలని ఆర్టీఐ కార్యకర్త, జర్నలిస్ట్ మిడిసినమెట్ల సతీష్(Journalist Midisinametla Satish) అన్నారు.కోదాడ లో శనిగల రాధాకృష్ణ అమ్మానాన్న  అనాధ ఆశ్రమం లో ఆదివారం సామాజిక కార్యకర్త ఆర్టిఐ నేరేడుచర్ల మండలం అధ్యక్షులు మిడిసినమెట్ల సతీష్, సోదరుడు వేణు తో కలిసి అనాధ పిల్లలకు మరియు పెద్దలకు తన వంతు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం సామాజిక కార్యకర్త సతీష్  మాట్లాడుతూ... యువత  మానవసేవే మాధవసేవ అనే దృక్పధంతో తమ వంతు సహాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఉచిత వైద్యం పేదలకు అందించాలన్నారు. యువత సామాజిక సేవలల్లో పాల్గొనాలని, పుట్టినరోజు కార్యక్రమాలు,వివిధ కార్యక్రమాలు అనాధ ఆశ్రమాలలో చేసుకుంటే పేదలకు సహాయం చేసినవారమవుతామ్మన్నారు.

యువత ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు దుష్ట ఆలోచన నేరాలు డ్రగ్స్ బానిస అవుతున్నారని యువత సమాజసేవ కార్యక్రమాలవైపు మరలాలని కోరారు. అనాధ ఆశ్రమాలకు ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసి వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు వచ్చి ఎవరైనా ఆశ్రమంలోని దివ్యాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అన్నదాన కార్యక్రమం చేసిన మిడిసినమెట్ల బ్రదర్ కు  దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశ్రమం తరఫున అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు