సోనాల మండలంలో బతుకమ్మ పండుగ వేడుకలు

09-10-2026 | 08:46pm

బోథ్. అక్టోబర్ 9 (విజయ క్రాంతి): సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలను(Bathukamma festival celebrations) ఉషోదయ పాఠశాలలో(Ushodaya School) ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఉపాధ్యాయులతో(Teachers') కలిసి చిన్నారులు బతుకమ్మ ఆడడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆడపడుచులు జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. నవరాత్రులు బతుకమ్మని కొలుస్తూ పువ్వుల పూజ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు