పీఆర్సీ కమిషన్ గడువు పెంపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి

09-10-2026 | 10:14pm

కొత్తపల్లి, అక్టోబర్ 09 (విజయక్రాంతి): పీఆర్సీ కమిషన్ గడువు పెంపు(Extension of PRC Commission's tenure) దిశగా సర్కార్ యోచిస్తోందన్న వార్త విని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు(Telangana employees, teachers, workers, and pensioners) ఆందోళన చెందుతున్నారని, పీఆర్సీ కమీషన్ గడువు పెంపు ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని , టీఎన్జీవోల(TNGO) కేంద్ర సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి.ఎం.ఏ.హమీద్ పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.

ఇప్పటికే పీ.ఆర్సీ మంజూరు చేయు గడువు 39 నెలల ఆలస్యం అయ్యిందని ఇంక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సహనాన్ని పరీక్షింద్దొని వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నమని,

ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉద్యోగులకు,   పెన్షనర్లకు ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చి, కాలానుగుణంగా వచ్చే డి.ఏలు మంజూరు చేసి తామేదో ఉద్యోగులకు మేలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఐదు (5) డీ.ఏలు చెల్లించాల్సిన చోట  కేవలం రెండు (2) డి.ఏలు (ఒకటి 33 వాయిదాలు, రెండవది 27 వాయిదాలతో) మంజూరు చేసి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంతోష పర్చినట్లు స్వీయ సంతృప్తి చెందుతున్నారని, అది కేవలం వారి భ్రమ మాత్రమేనని, మంజూరు చేసిన రెండు (2) డీ.ఏలతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరుకూడ సంతోషంగ లేరని, వాస్తవానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరు కూడ పీ.ఆర్సీ కొరకు ఎదురు చూస్తున్నారని,

ప్రభుత్వం రాబోయే గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మునిసిపల్ ఎన్నికలు, ఖైరతాబాద్ శాసనసభ మధ్యంతర ఎన్నికలు మరియు మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు, 1. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, 2. ఖమ్మం- నల్లగొండ- వరంగల్ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్నాయని తెలియజేస్తు, మున్సిపల్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎన్నికలు మరియు శాసన సభకు జరిగే ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్ల మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు రావలంటె వెంటనే పీ.ఆర్సీ నివేదికను తెప్పించుకొని ఎన్నికలలోపే పీఆర్సీ అమలు చేయాలి హమీద్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు