కేఆర్‌ఆర్‌ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 10:01pm

హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ ఎర్నేని కుసుమ వెంకటరత్నం

కోదాడ అక్టోబర్ 9(విజయక్రాంతి) : కోదాడలోని(Kodad) కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(KRR Government Degree College) శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ హధాస రాణి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, కమిషనర్‌ రమాదేవి, వైస్‌ చైర్మన్‌ దేవరపల్లి మల్లీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ(Bathukamma Festival) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచుల అనుబంధాన్ని చాటిచెప్పే పండుగ అని పేర్కొన్నారు.

అనంతరం ఆటపాటలతో సందడి చేసి బతుకమ్మలను కోదాడ చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ‌హెచ్‌పీఎస్‌ జాతీయ కార్యదర్శి కోటియా నాయక్‌, ధనమూర్తి, క్షేత్రయ్య, కౌన్సిలర్‌ గోపి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అప్పారావు, సైదిరెడ్డి, సైదులు, ప్రిన్సెస్‌, వెంకటేశ్వరరెడ్డి, నాగిరెడ్డి, రఫీ, శ్రీలత, నిర్మల, కుమారి యాదమ్మ, శ్రీలక్ష్మి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు