ఆరోగ్య జాతరకు కలెక్టర్ శ్రీకారం
19-09-2026 | 07:35pm
తలమడుగు సెప్టెంబర్ 19(విజయక్రాంతి) :తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (PM Sri Zilla Parishad High School) శనివారం ‘ఆరోగ్య జాతర’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించి, సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య అంశాలపై నిర్వహించిన పాటలు, నాటికలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో డీఈవో మాధవి, ఎంఆర్వో రాజ్‌మోహన్, ఎంఈవో, హెచ్‌ఎం వెంకట్‌రావు, సర్పంచ్ రాజన్న, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సాయికిరణ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు, సీడీపీవోలు సురేఖ, సౌందర్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.