శారీరక, మానసిక ఆరోగ్యం కొరకు యోగా, ధ్యానం
పీహెచ్సి వైద్యాధికారిని పి నాగిని
నేరేడుచర్ల,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే బి.సి. బాలుర గురుకుల హాస్టల్, రామాపురం నందు సీజనల్ వ్యాధులపై, మానసిక వ్యాధుల(mental illnesses)పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పున్నా నాగిని(Primary Health Centre Medical Officer Punna Nagini) అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ఒత్తిడి నుంచి ఎలా నివారించుకోవాలో తెలియజేస్తూ, ఎవరికైనా ఇబ్బంది ఉంటే టేలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ "14416" ను సంప్రదించి సలహాలు సూచనలు పొందాలని కోరారు.సీజనల్ వ్యాధుల పైన (మలేరియా, డెంగ్యూ, బోదకాలు, చికెన్ గున్యా, మెదడువాపు ) పై అవగాహన కల్పించారు.
దోమలు పుట్టకుండా, నీరు నిల్వ ఉంచే వాటిని వారానికి ఒకసారి తొలగించాలని శుభ్రం చేసుకోవాలని,దోమలు కుట్టకుండా మెస్ జాలీలు కిటికీలకు ఏర్పాటు చేసుకోవాలని, సాయంత్రం వేళలో తలుపులు మూసి ఉంచాలని, దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్, దోమతెరలు వాడాలని తెలిపారు.పరిశుభ్రతతో పాటు,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. హ్యాండ్ వాష్ టెక్నికులు పిల్లలందరికీ అర్థమయ్యేటట్లు చూపించారు. పౌష్టికాహారం తీసుకోవాలని, ఫిజికల్ ఎక్సర్ సై జులు చేసి మానసికంగా దృఢంగా ఉండాలని, యోగ ధ్యానం లాంటివి చేసుకొని, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని తెలియజేశారు.చిరు వ్యాధులు (జలుబు, దగ్గు, తలనొప్పి,ఎల్లర్జీ ) ఉన్న 25 మంది విద్యార్థులకు చికిత్స అందించారు.