కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఎన్నో ఇచ్చింది. విమర్శలు మీ విజ్ఞతకే వదిలేస్తాం
బోథ్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఇండియా నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీరు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు విమర్శలకు దిగడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతూ ప్రజల్లో మెప్పు పొందుతుందన్నారు.
అయితే పార్టీ ఫిరాయించిన ఎన్ ఎస్ వి ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ దేశ్పాండే విమర్శించడం సరైనది కాదని బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్నలు విమర్శించారు.
సోమవారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దివంగత మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా చేసిన రామచంద్రారెడ్డి మిమ్ములను రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆ నాయకుని నీడన ఎదిగిన మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరైనది కాదన్నారు. జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో విఫలమై విమర్శలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన నాయకులను ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎండగ డతారని పేర్కొన్నారు. ఇదే గల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, మండల అధికార ప్రతినిధి అచ్చితానందరెడ్డి పాల్గొన్నారు.