అభివృద్ధికి ఆటంకం లేకుండా ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపాలి

26-10-2026 | 07:04pm

మణికొండ, అక్టోబర్ 26 (విజయక్రాంతి): షేక్‌పేట్ నాలా, సీబీఐటీ కారిడార్, మణికొండ పైప్‌లైన్ రోడ్డు విస్తరణ పనులను పర్యావరణ హితంగా, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు(BRS Leaders) కోరారు. ఈ మేరకు సోమవారం హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తులో సుమారు రెండు లక్షల మంది అదనపు నివాసితులతో పెరగనున్న రవాణా భారం, ముష్కిన్ చెరువు పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ లేదా గ్రేడ్ సెపరేటర్, ఫ్రీ లెఫ్ట్ టర్న్‌లు, సమన్వయ ట్రాఫిక్ సిగ్నళ్లు, ప్రత్యామ్నాయ లింక్ రోడ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ముష్కిన్ చెరువు బఫర్ జోన్‌కు భంగం కలగకుండా, మురుగునీరు చెరువులోకి చేరకుండా శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం, అదనపు వ్యయం పెరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలని బీఆర్‌ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు