బాధితుల సమస్యలకు సత్వర న్యాయం అందించాలి
రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
రామగుండం,(విజయక్రాంతి) బాధితులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించాలని, ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో పరిశీలించి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam CP Amber Kishore Jha) తెలిపారు. సోమవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమం(Grievance Day Program)లో సీపీ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.