మాజీ గవర్నర్ ను కలిసిన ట్రస్ట్ సభ్యులు

05-10-2026 | 07:59pm

నిర్మల్ అక్టోబర్ (విజయక్రాంతి): అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్(Akhila Bharata Ayyappa Seva Trust) సభ్యులు మిస్సోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన, శబరిమల మేల్ శాంతి గోశాల విష్ణు వాసుదేవన్ నంబూత్రిలను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నవంబర్ నెలలో నిర్వహించేలా ప్రస్తుతం నిర్ణయం తీసుకుందని వివరించారు. నెలలో శబరిమలకు సమీపంలో నారాయణ తోడ గ్రామంలో ప్రతినెల ఆలయం తెరిచిన సమయంలో అన్న సంతర్పణ శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమానికి రావలసిందిగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో సన్మానించారు.

ఈ సందర్భంగా  శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రికి పాలు పండ్లు మరియు మెడికేర్ వాటర్ అలాగే కొండగట్టు అంజన్న సన్నిధిలో సైతం ఐదు సంవత్సరాలుగా అన్నదానం అలాగే శబరిమలకు సమీపంలో తుల్లపల్లి గ్రామంలో గల శ్రీకృష్ణ ఆలయం మరియు కాలేకట్టు పెద్ద పాదం, ఆర్టీవో కార్యాలయం అలాగే ఆభరణాలు తీసుకువస్తున్న స్వాములకు అల్పాహారం మరియు అన్నదానం అలాగే విద్యార్థుల కోసం జాబ్ మేళా వంటి కార్యక్రమాలు శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించామని చెప్పడంతో వారు సానుకూలంగా స్పందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అఖిలభారత సేవా ట్రస్ట్ ట్రస్టిరాజేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు జ్యోతిర్మయి, PRO మారుతిలు మర్యాదపూర్వకంగా కలిసి చాలువాతో సన్మానించారు.

మరిన్ని వార్తలు