అర్లి(టీ) సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): భీంపూర్ మండలం(Bheempur Mandal) అర్లి(టి) సబ్ స్టేషన్ పరిధిలోని రైతులు(Farmers ) శనివారం సబ్ స్టేషన్ ఎదుట కూర్చొని ధర్నాకు దిగారు. త్రీఫేస్ కరెంట్ సమస్యను తీర్చాలని నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక పత్తి పంట సరైన ఎదుగల లేక గత కొన్ని రోజుల నుండి తీవ్రమైన ఎండకు ఎండిపోతుంటే వాటిని కాపాడడానికి నీళ్లు ఇద్దామంటే త్రీఫేస్ కరెంట్ సరిగా ఉండడం లేదని రైతులు వాపోయారు.
ఒక గంటలో 13 సార్లు కరెంటు పోతుందని రైతులకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. అధికారులకు కరెంట్ గురించి అడిగితే లోడ్ సమస్య అని, పై నుంచి కరెంట్ లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని రైతులు వాపోయారు. జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులు, వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు కునరపు అశోక్, బక్కి కపిల్, గుర్ల నారాయణ, అంకం అశోక్, కాల్చప్ యాదవ్, మాడవి ఆషిక్, తదితరులు పాల్గొన్నారు.