జాతీయ స్థాయి క్రీడా పోటీలకు

03-10-2026 | 11:32pm

హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 

ఎల్బీనగర్, అక్టోబర్ 3 : హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు(Hayathnagar Government Degree College) చెందిన విద్యార్థులు అంతర్ కళాశాల స్థాయి క్రీడా పోటీల్లో(Inter-college level sports competition) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు(National-level competition) ఎంపికయ్యారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో(Osmania University Synthetic Track) నిర్వహించిన అంతర్ కళాశాల క్రాస్ కంట్రీ టోర్నమెంట్‌లో కళాశాలకు చెందిన డి.సంతోష్ కుమార్ (బీఎస్సీ - ఎంపీసీ, ప్రథమ సంవత్సరం) ప్రథమ స్థానం, ఎన్.ధోని (బీఏ, తృతీయ సంవత్సరం) తృతీయ స్థానం సాధించారు.

వీరిద్దరూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు 11 నవంబర్ 2026న కర్ణాటకలోని మంగళూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. అదేవిధంగా, డి. సంతోష్ కుమార్ 41వ జూనియర్ నేషనల్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు 23 నుండి 27 అక్టోబర్ 2026 వరకు చెన్నైలో నిర్వహించబడనున్నాయి. సంతోష్ కుమార్ అండర్-18 విభాగంలో 1000 మీటర్ల పరుగు పోటీలో పాల్గొననున్నారు. కె. ఉదయ్ కిరణ్ (బీఏ, ప్రథమ సంవత్సరం) జూనియర్ నేషనల్స్ లాంగ్ జంప్ విభాగానికి ఎంపికయ్యారు.

ఆయన వరంగల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మీట్‌లో ప్రథమ స్థానం సాధించారు. గణేష్ (బీఏ, ద్వితీయ సంవత్సరం) జూనియర్ నేషనల్స్‌కు ఎంపికయ్యారు. ఆయన చెన్నైలో జరిగే జూనియర్ నేషనల్స్‌లో 200 మీటర్ల రిలే విభాగంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేష్ బాబు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, అధ్యాపకులు విజేతలను, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ, వారి ప్రతిభను ప్రశంసించారు.

మరిన్ని వార్తలు