రైతులు ఉద్యాన పంటలు సాగు చేయాలి
* ఉద్యాన పంటల ద్వారా రైతులకు నిరంతర ఆదాయం
* పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుతోనే రైతుల అభివృద్ధి...
* ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి...
* ఆదిలాబాద్ జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్...
ఉట్నూర్, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి ): ఉద్యాన పంటల(Horticultural crops) ద్వారా రైతులకు(Farmers) నిరంతర ఆదాయం వస్తుందని, పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగుతోనే(Oil Palm Cultivation) రైతులు అభివృద్ధి చెందవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్(District Horticulture Officer Gudimalla Sandeep Kumar) రైతులకు సూచనలు చేశారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కోయల్ పాండ్రి గ్రామం లో ఉద్యాన శాఖ(Department of Horticulture) ఆధ్వర్యంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (MIDH) పథకం లో భాగంగా రైతులకు ఉద్యాన పంటల సాగు పై ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రాయితీలు సద్వినియోగం చేసుకోవాలనీ, ఎల్ -నినో వల్ల వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధిక దిగుబడి మరియు అధిక లాభం ఇచ్చే ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ మరియు పండ్ల తోటలు, పూలు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటికే 600 ఎకరాల్లో జిల్లాలో ఆయిల్ ఫామ్ రైతులు గెలలు కోస్తున్నారని వారికి 15 రోజుల్లోనే వారి ఖాతాలో ప్రభుత్వము డబ్బులు జమ చేస్తుందని, ఇంత త్వరగా చేతికి డబ్బులు వచ్చే పంట కేవలం ఆయిల్ పామ్ మాత్రమే అని రైతులకు తెలియజేశారు.
ఉద్యాన శాఖ ద్వారా వివిధ రకాల సబ్సిడీలైన ఆయిల్ పామ్ విస్తరణ కార్యక్రమం, సూక్ష్మ నీటి పారుదల పథకం, జాతీయ వెదురు మిషన్, సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, అగ్రో ఫారెస్ట్రీ వంటి పథకాల ద్వారా రైతులు లబ్ది పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి క్రాంతి కుమార్, ఉద్యాన విస్తరణ అధికారి ఆడెపు శేఖర్, ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ రవీందర్ మరియు ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు మరియు మడావితుకారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, మరియు 120 మంది రైతులు పాల్గొన్నారు.