రాత్రివేళ వాగుల్లో ఇసుక దోపిడీ.. చర్యలు ఎప్పుడు?

26-10-2026 | 12:36pm

బోథ్. అక్టోబర్ 26. (విజయ క్రాంతి). బోథ్సో, నాల నేరడిగొండ మండలాలలోని గ్రామాల సమీపంలోని వాగుల నుండి రాత్రిపూట యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న సమయంలో ఇసుక అక్రమ రవాణా జరిగితే భూగర్భ జలాలు ఇంకిపోయి భవిష్యత్తులో త్రాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అయితే రాత్రిపూట కొంతమంది ట్రాక్టర్లు యజమానులు అక్రమంగా ఇసుకను తీసుకువెళ్తున్నారని ఈ విషయంలో అధికారులు తమ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

తొలగించని విద్యుత్ మోటర్లు

ఆయా మండలాలలోని వాగుల చుట్టూ రైతులు తమ పంటలను సాగు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ నుండి సంబంధిత రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే సంబంధిత తాసిల్దారులు వాగుల చుట్టూ ఉన్న మోటార్లను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా విద్యుత్ మోటార్లు తొలగించకపోవడంతో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వాగు నీటి దారాలు ఎండిపోతున్నాయని పలు గ్రామాల ప్రజల ఆవేదన చేస్తున్నారు. వాగుల్లో నీరు లేకపోతే గ్రామాల సమీపంలోని బోరు బావుల్లో నీరు ఇంకిపోతుందని రెవెన్యూ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

ఇసుక అక్రమార్కులపై చర్యలు చేపట్టండి

ఇసుకను గ్రామాల సమీపంలోనీ వాగుల నుండి ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతున్నదని అయితే అక్రమ వ్యాపారం చేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆదివారం రాత్రి సోనాల మండల కేంద్రం సమీపంలోని వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు ట్రాక్టర్లను పట్టుకునేందుకు సిద్ధం కాగా విషయం తెలుసుకొని ట్రాక్టర్ల ఇసుకను ఖాళీ చేసి పరారీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతిరోజు నేరడిగొండ మండలంలోని కడెం పరివాహక గ్రామాల నుండే కాకుండా ఇతర మండలాలలోని చిన్న చిన్న వాగుల నుండి ఇసుక తరలిపోకుండా మండలాల అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు