మండల కేంద్రంలో ఘనంగా కొమరం భీం వర్ధంతి
బోథ్. అక్టోబర్ 26 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో కొమరం భీం వర్ధంతి(Komaram Bheem Death Anniversary) సభను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం డప్పు వాయిద్యాలతో మండల కేంద్రానికి చేరుకొని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట చత్రపతి శివాజీ అంబేద్కర్, విగ్రహానికి పూలమాలలు వేసి కొమరం భీం జెండా వద్ద పూజ నిర్వహించారు. అనంతరం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక తహసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో రత్నాకర్ రావు పాల్గొని పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆదివాసి పెద్దలు మెస్రం భూమన్న, పాత్ర గంగాధర్, రాయి సీడం ఇసు రు, జగున మారుతి, కోవ కిషన్, ఆత్రం నాగరావ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు భీమ్రావు, మాజీ సర్పంచ్ రాజేష్, భగవాన్ లక్ష్మణ్ తో పాటు గ్రామాల పటేళ్లు దేవారిలు మహాజనులు యువకులు పాల్గొన్నారు.