రాయి సెంటర్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ వర్ధంతి

26-10-2026 | 05:27pm

బోథ్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మండల కేంద్రంలో కొమురం భీం వర్ధంతి(Komaram Bheem Death Anniversary) కార్యక్రమాన్ని ఆదివాసులు ఘనంగా నిర్వహించారు. రాయి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాల రాయి సెంటర్ల ప్రతినిధులు ఆదివాసి పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆయన పోరాడిన త్యాగం ను గుర్తు చేశారు. కార్యక్రమంలో న్యాయవాది శంకర్ మాట్లాడుతూ జంగల్ జల్ జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కుల కోసం తుపాకీ గుండ్లకు ఎదురుపడి పోరాటం చేశారన్నారు.

ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దని హక్కుల పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయి సెంటర్ సార్ మెడి ఆడం భీమ్రావు, రాజ్ గోండు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు తొడ సంభూమన్న, ఉపాధ్యాయులు మడవి లాలు రామ్, పడిగెల లక్ష్మణ్, పెందూరు సోనేరావు, మండాడి శంభు, కరత్వాడ సర్పంచ్ విశ్వేశ్వర్ రావు, ఉప్పల్ దరి సర్పంచ్  అనసూయ, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, తులసమ్మ గోపాల్, దొంగరి రమేష్, మల్లెపూల సుభాష్, లచ్చన్న, దేశం భీమలింగు, పటేళ్లు గూడెం రమేష్, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు