విద్యుత్ ఏఈ పై చర్యలు తీసుకోవాలనీ ప్రజావాణిలో ఫిర్యాదు

26-10-2026 | 06:28pm

ధర్మపురి (విజయక్రాంతి): విద్యుత్ సమస్యలు(Power problems) పరిష్కరించడంలో వెల్గటూర్ మండల విద్యుత్ ఏఈ విఫలం అయ్యారనీ, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముత్తునూర్ గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ అక్రమాలిక్ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకి ఫిర్యాదు చేశారు.

తమ గ్రామంలో పలు వార్డులలో కనెక్టింగ్ లూస్ లైన్లను సంబంధించి నూతన గృహ నిర్మాణల కోసం కరెంట్ వినియోగదారుల ప్రజల అవసరాల రీత్యా స్తంబాలు వేయాలని పలుమార్లు విద్యుత్ అధికారి ఏఈ కి పలు మార్లు వినతులు చేసిన స్పందన కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నూతన మీటర్ కి డీడీలు తీసి ఏళ్ళు గడుస్తున్న స్తంభాలు వేయడం లో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరపి స్తంభాలు వేసేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు