PRTU-TS జిల్లా అధ్యక్షుడుకు ఘన సన్మానం

05-10-2026 | 09:22pm

బెల,(విజయక్రాంతి): PRTU-TS ఆదిలాబాద్()PRTU-TS Adilabad జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొమ్ము కృష్ణ కుమార్‌ను మండల సర్పంచుల సంఘం, కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు కొమ్ము కృష్ణ కుమార్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయ సంక్షేమం, సంఘ అభివృద్ధి(teacher welfare and union development)కి ఆయన చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు అశోక్ ఠాక్రే, బోడకుంటి రాకేష్, బోక్రే శంకర్,గొడె అవినాష్, వినోద్, రాహుల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాందాస్ నాక్లె, వాన్కడే రూప్ రావ్ రాహుల్ , సాగర్, తదితరులు పాల్గొని కొమ్ము కృష్ణ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు