గాంధీ, శాస్త్రి ఆశయాలే స్ఫూర్తి

02-10-2026 | 12:09pm

ఘనంగా జయంతి వేడుకలు

బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi), మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను(Former PM Lal Bahadur Shastri birth anniversary celebrations) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం(Independence movement)లో మహాత్మా గాంధీ చేసిన సేవలను, దేశ అభివృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాంఖడే రూపురావు, నాకలే రాందాస్, వామన్, రాజు, ఆకాష్, ఘంష్యం, సంజయ్, మొభీన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు