సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తం.

12-10-2026 | 04:04pm

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana government) చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని నూతనంగా నియమించబడ్డ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ అలీ(Mohammed Abdul Ali) జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ అబ్రర్ అహమ్మద్ పేర్కొన్నారు. నూతనంగా నియమించిన మైనార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తామన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్  రాజు యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బి గంగయ్య, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అచ్యుతానంద రెడ్డి పీసీసీ కమిటీ సభ్యులు షేక్, సహకార సంఘం డైరెక్టర్ సట్ల ఉమేష్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు అడ్డి గ ఆశన్న, ఉప సర్పంచ్ విజయ సన్నీ రెడ్డి, వార్డు సభ్యులు షాకీర్ అహ్మద్ ,సోహెబ్ అహ్మద్, అమీర్, అల్తాఫ్ లతోపాటు మత పెద్దలు మౌలానా అఖిల్ అహ్మద్, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు