డీజే వద్దు.. భజనలే ముద్దు అంటున్న ప్రజలు

25-09-2026 | 08:27pm

బేల సెప్టెంబర్ 25(విజయక్రాంతి):బెల మండల కేంద్రంలో(Mandal Center) గణేష్ నిమజ్జన వేడుకల్లో డీజే శబ్దాలకు దూరంగా ఉంటూ భక్తి భావంతో భజనలు, భక్తిగీతాలతో నిమజ్జన కార్యక్రమాన్ని(Immersion program) నిర్వహించేందుకు బేల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. డీజే మోతలు, అధిక శబ్దాలకు బదులుగా భజనలు, కీర్తనలతో ప్రశాంత వాతావరణంలో గణనాథుడికి వీడ్కోలు పలకాలని ప్రజలు కోరుతున్నారు.

“డీజే వద్దు.. భజనలే ముద్దు” అంటూ ప్రజలు సందేశం ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు