సోనాల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
బోథ్. అక్టోబర్ 9 (విజయక్రాంతి) : సోనాల మండలాన్ని(Sonala Mandal) ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సోనాల తాసిల్దార్ మల్లేశంకు(Sonala Tahsildar Mallesham) బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) వినతి పత్రం అందించారు. ఎల్ నేను ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయిందని దీంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేవని పేర్కొన్నారు,. ప్రస్తుతం పత్తి పంట(Cotton crop) వాడిపోతున్నదని పూత రాలిపోతున్నదని వారు పేర్కొన్నారు. భూగర్భ జలాలు అడగండి పోతుండడంతో భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉందని వారు పేర్కొన్నారు.
రైతన్న ఆదుకోవడం కోసం అవసరమైన వ్యవసాయ పరికరాలు సబ్సిడీ(Subsidy for agricultural equipment) ద్వారా అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిన్నయ్య, బిఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి గ్రామ సర్పంచ్ బిందుజ, సాకే రా సర్పంచ్ నానాజీ, గుర్రాల తండా సర్పంచ్ కరికే దినేష్, దేవుల నాయక్ తండ సర్పంచ్ బాబూలాల్, కేశవ్ గూడ సర్పంచ్ కిషన్, మిట్టపక్క తండా సర్పంచ్ గులాబ్ సింగ్, సోనాల ఉపసర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ సకారాం, నాయకులు ఈర్ల అభిలాష్, ఈశ్వర్, రమేష్ బద్ధం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.