వ్యాపార రంగంలో రాణించాలి
జపాన్ ఇంటర్నేషనల్ సేల్స్ సర్వీస్ ప్రారంభోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి..
సిద్దిపేట రూరల్,అక్టోబర్ 9 విజయక్రాంతి: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జపాన్ ఇంటర్నేషనల్ సేల్స్ సర్వీస్(Japan International Sales Service) ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి(Vanga Rajeshwar Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ సల్మాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా ప్రారంభించిన వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో(Business sector) మంచి గుర్తింపు సంపాదించుకోవాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడం ద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు(Economic activities) మరింత విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. సల్మాన్ వ్యాపారంలో మరింత పురోగతి సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.