నందిగుండం దుర్గామాత ఆలయంలో ఉత్సవాలు
నిర్మల్ అక్టోబర్ 9 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో(Sri Nandigundam Durga Mata Temple) దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) వ్యవస్థాపకులు కొండా జి వెంకట చారి తెలిపారు. శుక్రవారం ఉత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలను(Navratri celebrations) వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయంలో భవాని మాలధారణ కార్యక్రమం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 20న విజయదశమి వేడుకలను(Vijayadashami celebrations) ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.